హిమాచల్‌ప్రదేశ్‌లోని హహీర్పూర్ జిల్లాలో కలుషిత నీరు తాగడంతో 535 మంది అస్వస్థతకు గురయ్యారు.నీళ్లలో పెద్దమొత్తం బ్యాక్టీరియా ఉండటంతోనే ప్రజలు అనారోగ్యంపాలయ్యారని రంగ్‌గాస్ పంచాయతి హెడ్ రాజీవ్ కుమార్ వెల్లడించారు.నిర్మాణంలో ఉన్న ట్యాంక్‌లో నిల్వ ఉంచిన నీటిని శుద్ధి చేయకుండానే పంపిణీ చేశారని గ్రామస్తులు ఆరోపించారు. బాధితులంతా సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు సొంత నియోజకవర్గమైన నౌదాన్‌కు చెందినవారే కావడం విశేషం. ఈ ఘటనపై సీఎం స్పందించారు. బాధితుకు మెరుగైన వైద్య సాయం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. అవసరమైన ఔషధాలను అందుబాటులో ఉంచాలని వైద్యశాఖ అధికారులకు సూచించారు. దీనిపై జిల్లా, రాష్ట్ర స్థాయి ఏజెన్సీలు పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
Here's ND Tv Tweet
535 Fall Sick Due To Water Contamination In Many Villages In Himachal https://t.co/1gikt8jXRi pic.twitter.com/k7KFmkzSeG
— NDTV News feed (@ndtvfeed) January 29, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)