హిందీ భాషపై త‌మిళ‌నాడు విద్యాశాఖ మంత్రి కే. పొన్ముడి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. హిందీ మాట్లాడేవారు కోయంబ‌త్తూర్‌లో పానీపూరీలు అమ్ముకుంటున్నార‌ని ఎద్దేవా చేశారు. త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు ఇంగ్లీష్‌, త‌మిళ్ నేర్చుకుంటుండ‌గా ఇత‌ర భాష‌ల అవ‌స‌రం ఏముంద‌ని మంత్రి ప్ర‌శ్నించారు. కోయంబ‌త్తూర్‌లోని భార‌తీయ‌ర్ యూనివ‌ర్సిటీలో శుక్ర‌వారం జ‌రిగిన స్నాత‌కోత్స‌వంలో మంత్రి మాట్లాడుతూ త‌మిళ‌నాడులో ఇంగ్లీష్‌, త‌మిళ్ భాష‌లున్నాయ‌ని, ఇంగ్లీష్ అంత‌ర్జాతీయ భాష కాగా, త‌మిళ్ స్ధానిక బాష‌ని చెప్పుకొచ్చారు.

హిందీ నేర్చుకుంటే మ‌న‌కు ఉద్యోగాలు వ‌స్తాయ‌ని చెబుతున్నారు..మ‌న‌కు ఉద్యోగాలు వ‌స్తున్నాయా అని ప్ర‌శ్నించారు. తమిళ‌నాడులో, కోయంబ‌త్తూర్‌లో ఎక్క‌డికైనా వెళ్లి చూస్తే హిందీ మాట్లాడే వారు పానీపూరీలు అమ్ముకుంటూ బ‌తుకుతున్నార‌ని చెప్పారు. త‌మిళ‌నాడు విద్యావ్య‌వ‌స్ధ దేశంలోనే ప్రామాణికంగా ముందువ‌రుస‌లో ఉంద‌ని, త‌మిళ విద్యార్ధులు ఏ భాష నేర్చుకునేందుకైనా సిద్ధంగా ఉంటార‌ని అన్నారు. హిందీ కేవ‌లం ఆప్ష‌న‌ల్ ల్యాంగ్వేజ్ మాత్ర‌మేన‌ని, దాన్ని నేర్చుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి కాద‌ని అన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)