ఆన్లైన్ బెట్టింగ్ కు ఇంజనీరింగ్ విద్యార్థి బలయ్యాడు. వర్ధన్నపేట మండలం కడారిగూడెం గ్రామానికి చెందిన బత్తిని గణేశ్‌(20) హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్‌లో ఓ ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు.గణేశ్‌ తండ్రి పదేళ్ల క్రితమే చనిపోగా, తల్లి ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా పని చేస్తూ కుమారుడిని బీటెక్‌ చదివిస్తుంది.. అయితే ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసైన గణేశ్‌ తన ఫ్రెండ్స్ దగ్గర భారీగా అప్పులు చేశాడు.

తల్లి ఇచ్చిన కాలేజీ ఫీజు డబ్బుతో ఆన్‌లైన్‌ బెట్టింగ్, పోవడంతో పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న బీటెక్ విద్యార్థి

ఇటీవల దసరా పండుగకు ఇంటికి వెళ్ళిన గణేష్ కాలేజీలో ఫీజు కట్టేందుకు రూ.80 వేలు తీసుకొని, వాటిని కూడా ఆన్‌లైన్‌ గేమ్‌లో పోగొట్టుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన గణేశ్‌ సోమవారం కాలేజీ సమీపంలో పురుగుల మందు తాగి చనిపోయాడు.. భర్త లేకపోయినా కష్టపడి కొడుకును చదివిస్తే, తాను చనిపోయాడని గణేష్ తల్లి భోరున విలపించింది.సిన ఆ అప్పులు తీర్చలేక మనోవేదనకు గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది.

btech-student-dies-by-suicide-after-losing-money-in-online-betting

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)