భారత్‌, చైనా సైనికుల మధ్య సరిహద్దులో మరిన్ని ఘర్షణలు జరిగే అవకాశం ఉందంటూ ఓ నివేదిక బయటకు వచ్చింది. ఈ నెల 20 నుంచి 22 వరకు జరిగిన అత్యున్నత పోలీసు అధికారుల సమావేశంలో ఈ రహస్య నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. అయితే ఈ నివేదికపై భారత్‌, చైనా రక్షణ, విదేశాంగ మంత్రిత్వ శాఖలు ఇప్పటి వరకు స్పందించలేదు.

ఈ నివేదిక ప్రకారం.. హిమాలయ ప్రాంతంలోని లడఖ్‌ వద్ద సైనికపరమైన మౌలిక సదుపాయాలను చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) పెంచుతుండటం ఇరు దేశాల మధ్య ఉద్రికత్తలకు దారితీయవచ్చని అంచనా వేసింది. భారత్‌-చైనా మధ్య గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఘర్షణల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఇరు దేశాలు పోటాపోటీగా సైనిక మౌలిక నిర్మాణాలు చేపట్టడంతోపాటు బలగాలను పెంచుకుని బలాబలాలను పరీక్షించుకుంటున్నాయి’ అని అందులో పేర్కొన్నారు.

Here's Reuters Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)