దేశంలో కరోనా రోజూ వారీ కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా 800కు చేరువలో కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో 798 కొత్త కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో కలిసి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,091కి చేరింది. ఇక నిన్న ఒక్కరోజే ఐదు మరణాలు నమోదయ్యాయి. మహమ్మారి కారణంగా కేరళలో ఇద్దరు, మహారాష్ట్ర, పుదుచ్చేరి, తమిళనాడులో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,33,351కి ఎగబాకింది.
Here's News
India logs 798 new Covid infections, 5 deaths; 157 sub-variant cases so far
Read: https://t.co/Jxegtm2KEF#COVID #JN1CovidVariant pic.twitter.com/dfAcdD9gRn
— IndiaToday (@IndiaToday) December 29, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)