దేశంలో గురువారం 21,566 మందికి పాజిటివ్ రాగా, కొత్తగా 21,880 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,38,47,065కు చేరింది. ఇందులో 4,31,71,653 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,930 మంది మృతిచెందగా, మరో 1,49,482 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో కరోనాకు 60 మంది బలవగా, 21,219 మంది డిశ్చార్జీ అయ్యారు. ఇక కరోనా కేసులు భారీగా నమోదవుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 4.25 శాతానికి పెరిగింది. మొత్తం కేసుల్లో 0.34 కేసులు యాక్టివ్‌గా ఉండగా, రికవరీ రేటు 98.46 శాతం, మరణాలు 1.20 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 201.30 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.
India records 21,880 new Covid19 cases and 60 deaths in the last 24 hours; Active cases at 1,49,482 pic.twitter.com/HCE6x3uNiW
— ANI (@ANI) July 22, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)