దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం 6984 కేసులు నమోదవగా, తాజాగా మరో వెయ్యి కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 7974 కరోనా కేసులు (Covid-19) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,47,18,602కు చేరింది. ఇందులో 3,41,54,879 మంది కరోనా నుంచి కోలుకోగా, 4,76,478 మంది మృతిచెందారు. మరో 87,245 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక బుధవారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 7948 మంది మహమ్మారి నుంచి బయటపడగా, 343 మంది చనిపోయారు. కరోనా యాక్టివ్ కేసులు 0.25 శాతం ఉన్నాయని, రికవరీ రేటు 98.38 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 135.25 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని, బుధవారం ఒక్కరోజే 68,89,025 మందికి టీకాలు ఇచ్చామని తెలిపింది.
India reports 7,974 new #COVID19 cases, 7,948 recoveries, and 343 deaths in the last 24 hours.
Active cases: 87,245
Total recoveries: 3,41,54,879
Death toll: 4,76,478
Total Vaccination: 1,35,25,36,986 pic.twitter.com/ZfVAKcK6dN
— ANI (@ANI) December 16, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)