కరోనా కార‌ణంగా నిలిచిపోయిన అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌ను భార‌త్ పునఃప్రారంభించేందుకు సిద్ధ‌మైంది. ఈ నెల 27 నుంచి అంతర్జాతీయ విమాన స‌ర్వీసుల‌ను ప్రారంభించ‌నున్న‌ట్లుగా పౌర విమాన‌యాన శాఖ మంగ‌ళ‌వారం నాడు ప్ర‌క‌టించింది. అయితే ఈ ప్ర‌యాణాల్లో వైద్య‌,ఆరోగ్య శాఖ సూచించిన నిబంధ‌న‌ల‌ను ప‌క‌డ్బందీగా అమ‌లు చేయ‌నున్న‌ట్లుగా కూడా ఆ శాఖ ప్ర‌క‌టించింది. కోవిడ్ విజృంభ‌ణ‌తో విదేశాల‌కు దేశీయ విమాన స‌ర్వీసులు, దేశానికి విదేశీ విమాన స‌ర్వీసుల‌ను ఇప్ప‌టికే ప‌లుమార్లు నిలిపివేసిన సంగ‌తి తెలిసిందే.

క‌రోనా తొలి వేవ్‌తో మొద‌లైన ఈ స‌ర్వీసుల నిలుపుద‌ల.. క‌రోనా కాస్తంత త‌గ్గ‌గానే తిరిగి పున‌రుద్ధ‌రించ‌బ‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో క‌రోనా థ‌ర్డ్ వేవ్ నేప‌థ్యంలో ఇటీవ‌లే అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌ను భార‌త్ నిలిపివేసింది. తాజాగా దేశంలో రోజువారీ క‌రోనా కొత్త కేసుల సంఖ్య 4 వేల‌కు దిగ‌డంతో కొన్ని జాగ్ర‌త్త‌ల‌తో అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల పున‌రుద్ధ‌ర‌ణ‌కు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అయితే క‌రోనా నిబంధ‌న‌ల‌ను మాత్రం త‌ప్ప‌నిస‌రిగా పాటించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)