Chetak Helicopter Emergency Landing in Fields: ఇండియన్‌ ఆర్మీకి చెందిన చేతక్ హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో అత్యవసరంగా పొలాల్లో దిగింది.సమస్య పరిష్కారం అయిన తరువాత అక్కడి నుంచి అది ఎగిరి వెళ్లింది. అయితే ఆర్మీ హెలికాప్టర్‌ను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు.ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

రాజస్థాన్‌లోని జైపూర్‌కు వెళ్తున్న ఆర్మీకి చెందిన చేతక్ హెలికాప్టర్‌లో ఇంజిన్ చిప్ వార్నింగ్ లైట్ ఆన్ అయ్యింది.దీంతో పైలట్లు అప్రమత్తమై ముందు జాగ్రత్త కోసం సమీపంలోని పొలాల్లో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు.సాంకేతిక సమస్యను సరిదిద్దిన తర్వాత హెలికాప్టర్ నిర్ణీత గమ్యస్థానానికి చేరుకున్నట్లు ఆర్మీ వెల్లడించింది.జైపూర్‌కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిద్వానాలో శుక్రవారం ఉదయం 10:35 గంటల సమయంలో సైనిక హెలికాప్టర్ పొలాల్లో దిగినట్లు తెలిపింది. ఆ సమయంలో అందులో వీఐపీలు ఎవరూ లేరని ఇండియన్‌ ఆర్మీ పేర్కొంది.  ఐఏఎఫ్‌ విమానంకు తప్పిన పెను ప్రమాదం, సాంకేతిక లోపంతో గంట సేపు గాలిలోనే చక్కర్లు, ఎట్టకేలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్

Here's ANI Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)