భారత్‌లోనూ ఒమిక్రాన్‌ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశంలో ఇప్పటి వరకు 200 మంది ఒమిక్రాన్‌ బారిన పడినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం వెల్లడించింది. వీరిలో 77 మంది కోలుకున్నట్లు పేర్కొంది. దేశంలో 12 రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూడగా...వీటిలో అత్యధికంగా మహారాష్ట్ర 54, ఢిల్లీలో 54 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 20, కర్ణాటకలో 19, రాజస్థాన్‌ 18, కేరళ 15, గుజరాత్‌ 14, ఉత్తరప్రదేశ్‌ 2, ఆంధ్రప్రదేశ్‌, చండీగఢ్‌, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)