జార్ఖండ్‌లోని జమ్తారాలోని కలాజారియా రైల్వే స్టేషన్ సమీపంలో ప్రయాణికులపై నుంచి రైలు (Jharkhand Train Accident) దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తోంది. మరింత ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని జాతీయ మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. జమ్తారాలోని కలాజారియా రైల్వే స్టేషన్‌కు సమీపంలో అంగా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశాడు. అయితే రైలు మార్గం అంచు నుంచి దుమ్ము లేవడంతో మంటలు చెలరేగుతున్నాయనే ఆందోళన నేపథ్యంలో లోకో పైలట్ రైలును నిలిపివేశాడు. దీంతో ప్రయాణికులు రైలు దిగారు.

పక్కన నున్న ట్రాక్‌పై నిలబడి ఉండగా ఇదే సమయంలో అటుగా వచ్చిన మరో ప్యాసింజర్ ట్రైన్ ప్రయాణికుల మీద నుంచి (Train Runs Over Passengers) దూసుకెళ్లింది. కాగా సమాచారం అందిన వెంటనే పోలీసులు, వైద్య బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే మరికొన్ని మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.  జార్ఖండ్‌లో ట్రాక్ దాటుతుండగా ప్రయాణికులను ఢీకొట్టిన రైలు, ఎగిరి అవతల పడి నుజ్జు నుజ్జు అయిన వారి శరీరాలు

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)