కర్ణాటకలో బుధవారం పోలింగ్‌ కేంద్రం నుంచి తీసుకెళ్తున్న ఈవీఎంలను గ్రామస్థులు పగలగొట్టారు. విజయపుర జిల్లా మసబినళ గ్రామంలో ఇది చోటుచేసుకోగా.. పోలీసు బలగాల మోహరింపుతో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది.అడ్డొచ్చిన పోలీసులను చితకబాది ఈవీఎంలను లాక్కుని ధ్వంసం చేశారు గ్రామస్తులు. అంతటితో ఆగకుండా ఎన్నికల సిబ్బందిపైనా గ్రామస్తుల్లో కొందరు దాడికి తెగబడ్డారు.

ఎన్నికల సిబ్బంది కారును పల్టీకొట్టించి మరీ ధ్వంసం చేశారు. వీవీఎం ప్యాట్‌ మిషన్లను నుజ్జు నుజ్జు చేసిన గ్రామస్తుల దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. బాలెట్‌ యూనిట్లను డ్యామేజ్‌ చేసిన వ్యవహారంపై ఈసీ స్పందించింది. ఈవీఎంలను పగలకొట్టడంతో పాటు ఓ అధికారిపైనా దాడి చేసినందుకుగానూ.. 23 మందిని పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించింది. కంట్రోల్‌, బాలెట్‌ యూనిట్‌తో పాటు మూడు వీవీప్యాట్‌లు ధ్వంసం చేశారని తెలిపింది.

Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)