హిమాచల్‌ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో సోమవారం ఉదయం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. విద్యార్థులు, ప్రయాణికులతో వెళ్తున్న స్కూల్‌ బస్సు అదుపుతప్పి లోయలోపడిపోయింది. ఈ దుర్ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పాఠశాల విద్యార్థులు, కొందరు ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో బస్సు నుజ్జునుజ్జు అయింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కులు జిల్లా డిప్యూటీ కమిషనర్‌ అశుతోష్‌ గార్గ్‌ చెప్పారు. సయింజ్‌ వైపునకు వెళ్తున్న బస్సు ఉదయం 8.30 ప్రాంతంలో జంగ్లా గ్రామం వద్ద ప్రమాదానికి గురైందని తెలిపారు. జిల్లా అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని అన్నారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నట్టు గార్గ్‌ వెల్లడించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)