భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ గత రాత్రి అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ (96) మళ్లీ అస్వస్థతకు లోనయిన సంగతి విదితమే. కుటుంబ సభ్యులు ఆయనను బుధవారం ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. డా. వినీత్ సూరీ ఆధ్వర్యంలో అద్వానీకి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు నిన్న పేర్కొన్నాయి. కాగా గత నెల 26న అద్వానీ ఢిల్లీ ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
యూరాలజీకి సంబంధించిన సమస్యలు ఉన్న కారణంగా వైద్యులు సర్జరీ చేసి డిశ్చార్జ్ చేశారు. తాజాగా ఆయన మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఇప్పుడు అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 2002 నుండి 2004 వరకు ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంలో అద్వానీ ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు. ఈ ఏడాది మార్చిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు భారతరత్న పురస్కారాన్ని అందించారు.
Here'
VIDEO | BJP veteran and former deputy prime minister Lal Krishna Advani leaves after being discharged from Apollo Hospital in Delhi.
The 96-year-old was admitted to the Apollo Hospital this Wednesday, days after being discharged from the All India Institute of Medical Sciences… pic.twitter.com/YbvnvfuIXi
— Press Trust of India (@PTI_News) July 4, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)