Delhi Lockdown Extended: మరో వారం రోజులు లాక్‌డౌన్ పొడిగింపు, ఆ తర్వాత ఎత్తేస్తామని తెలిపిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, దేశ రాజధానిలో భారీగా తగ్గిన కరోనా కేసులు
ఢిల్లీలో లాక్‌డౌన్ ఆంక్షలు అమల్లోకి వచ్చిన తరువాత కరోనా కేసులు భారీగా తగ్గిపోయాయి. కేవలం నెల రోజుల్లోనే 29 వేల నుంచి 2 వేల లోపుకు దిగొచ్చాయి. కేసులు పెరిగిపోతుండడంతో వెంటనే లాక్‌డౌన్ విధించిన ఢిల్లీ సీఎం.. ఫలితం రాబట్టారు. ఆదివారం ఆయన ఢిల్లీలో కరోనా పరిస్థితులపై మీడియాతో మాట్లాడారు.
ప్రస్తుతం మరో వారం పాటు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నామని, అందరి ఏకాభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. ఈ నెల 31 తర్వాత లాక్ డౌన్ ఆంక్షలను సడలిస్తామని స్పష్టం చేశారు. ఢిల్లీలో కొత్తగా కేవలం 1,600 కేసులే నమోదయ్యాయని ప్రకటించారు. పాజిటివిటీ రేటు 2.5 శాతం కన్నా తక్కువే నమోదైందన్నారు. కేసులు భారీగా తగ్గుతున్నాయని, ఇంకో వారం రోజుల్లో లాక్ డౌన్ ను క్రమంగా ఎత్తేస్తామని చెప్పారు.
కరోనాతో పోరు ఇంకా అయిపోలేదని కేజ్రీవాల్ చెప్పారు. మూడో వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొరత ఉందని చెప్పారు. త్వరలోనే 2 కోట్ల మందికి టీకాల కోసం చర్యలు చేపడతామన్నారు. దాని కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేజ్రీవాల్ వివరించారు.
Here's ANI Update
Lockdown has been extended till 31st May, 5am in Delhi: Delhi CM Arvind Kejriwal
— ANI (@ANI) May 23, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 23, 2021 01:12 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

