గ్యాస్ వినియోగదారులకు దేశీయ చమురు సంస్థలు కాస్త ఉపశమనం కలిగించాయి. వాణిజ్య అవసరాలకు (Commercial gas) వినియోగించే 19 కేజీల సిలిండర్‌పై రూ.91.50 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. తగ్గిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని వెల్లడించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో రూ.1976.07గా ఉన్న వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.1885కు తగ్గింది. ఇక ముంబైలో రూ.1844, కోల్‌కతాలో 1995.50, చెన్నైలో రూ.2045కు చేరాయి. తాజా తగ్గింపుతో హైదరాబాద్‌లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.2099.5కు తగ్గింది. కాగా, గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. చివరగా జులై 6న రూ.50 పెరిగింది.
LPG Price Cut: Commercial Cooking Gas Becomes Cheaper by Up to Rs 100, Check Reduced Rates in Metro Cities#LPGprice #News #CommercialLPG #lpgcylinder https://t.co/MiFNx36p0q
— LatestLY (@latestly) September 1, 2022
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)