మధ్యంతర బడ్జెట్ సమావేశాలకు ముందే సామాన్యులకు షాక్ తగిలింది. దేశ వ్యాప్తంగా ఎల్పీజీ వాణిజ్య సిలిండర్ ధరలు పెరిగాయి. ఒక్కో సిలిండర్ పై రూ. 14 పెంచారు. ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,769.50కి చేరుకుంది. స్థానిక పన్నులను బట్టి ఈ ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుంది. ఇప్పటి నుంచి సిలిండర్ బుక్ చేసుకునే వారు పెరిగిన ధరను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, గృహ అవసరాల కోసం వినియోగించే డొమెస్టిక్ సిలిండర్ ధరలను మాత్రం పెంచలేదు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను చివరిసారిగా మార్చ్ 1వ తేదీన మార్చారు.
Here's News
#LPG Price Hike | 🔴19-kg LPG cylinder price hiked by ₹14 to ₹1,769.5/cylinder from ₹1,755.5/cylinder pic.twitter.com/zVLjQgHlhS
— CNBC-TV18 (@CNBCTV18Live) February 1, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)