యూపీలోని బుద్వాన్‌లో ఆధార్ కార్డుపై పేరు సరిగా లేని కారణంగా ఓ బాలికకు స్కూల్ అడ్మిషన్ దక్కలేదు. బిల్సీ తహిశీల్‌లోని రాయ్‌పూర్ గ్రామానికి చెందిన దినేశ్ తన కూతురు ఆర్తిని స్కూల్‌లో అడ్మిట్ చేసేందుకు తీసుకువెళ్లగా.. ప్రభుత్వ స్కూల్ అధికారులు ఆధార్ కార్డు కావాలని అడిగారు. అయితే ఆ అమ్మాయి ఆధారు కార్డుపై మధు కా పాంచ్వా బచ్చా అని రాసి ఉన్నట్లు స్కూల్ యాజమాన్యం గుర్తించింది. ఇంగ్లీష్‌లో బేబీ ఫైవ్ ఆఫ్ మధు అని కార్డుపై రాసి ఉంది. ఆ కార్డుకు ఎటువంటి ఆధార్ నెంబర్ కూడా లేదు. కాగా పోస్టాఫీసులు, బ్యాంకుల్లో ఆధార్ కార్డులను తయారు చేస్తున్నారని, తీవ్ర నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, బ్యాంక్ పోస్టాఫీసు అధికారులకు అలర్ట్ చేస్తామని జిల్లా మెజిస్ట్రేట్ దీపా రంజన్ తెలిపారు. మరోవైపు సోషల్ మీడియాలో ఆ ఆధార్ కార్డు వైరల్ అవుతోంది.
A #woman named her child ‘Madhu ka Panchwa Baccha’ and ‘Baby five of Madhu’ on her #Aadhaarcard. #ViralNews #FunnyNews https://t.co/eZUBeQCVGb
— India.com (@indiacom) April 4, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)