మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో వేగంగా వెళ్తున్న బస్సుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ప్రయాణికులు అగ్నిప్రమాదం నుంచి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి ఓ ప్రయివేటు బస్సు బుధవారం రాత్రి హైదరాబాద్‌కు బయల్దేరింది. జాతీయ రహదారి 69పై బస్సు వేగంగా వెళ్తున్న సమయంలో ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్ బస్సును నిలిపేశారు.
ప్రయాణికులంతా వేగంగా బస్సులో నుంచి కిందకు దిగారు. అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
#Betul: 60 passengers escape unhurt after bus catches firehttps://t.co/YmFnTZPeqX
To get epaper daily on your whatsapp click here:
— Free Press Journal (@fpjindia) March 17, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)