మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. శివరాజ్‌లో సిగ్గులేనితనం తారాస్థాయికి చేరుకుందంటూ ట్వీట్ చేసింది. మధ్యప్రదేశ్‌లోని బిజెపి ప్రభుత్వం కన్యా వివాహ యోజన కింద ఇచ్చిన మేకప్ బాక్స్‌లలో కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలను పంపిణీ చేస్తున్నారంటూ వీడియోని షేర్ చేసింది. శివరాజ్ జీ, మీకు సిగ్గు లేదు అంటూ మండిపడింది.
మధ్యప్రదేశ్‌లోని జాబువా జిల్లాలో సామూహిక వివాహాల్లో పాల్గొన్న జంటలకు ఇస్తున్న కొత్త వెడ్డింగ్ కిట్(New Wedding Kits)లో కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు ఉన్నట్లు గుర్తించారు.ముఖ్యమంత్రి కన్యా వివాహం స్కీమ్‌లో భాగంగా జరిగిన సామూహిక వివాహాల్లో కిట్‌లను అందజేశారు. దాదాపు 296 జంటలకు అక్కడ పెళ్లి జరిగింది. అయితే ఆ జంటలకు ఇచ్చిన కిట్లలో కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు ఉన్నట్లు తేలింది. కిట్లలో ఉన్న మేకప్ బాక్సుల్లో ఈ ప్యాకెట్లను గుర్తించారు. వీడియో ఇదిగో..
Video
शिव'राज में बेशर्मी चरम पर :
मध्यप्रदेश की बीजेपी सरकार ने कन्याविवाह योजना के अंतर्गत दिए गए मेकअप बॉक्स में कंडोम ओर गर्भनिरोधक टेबलेट्स बांटे है।
शिवराज जी,
कोई शर्म बाकी है❓ pic.twitter.com/2kvT6JBO7E
— MP Congress (@INCMP) May 30, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)