మధ్యప్రదేశ్‌లోని గునా జిల్లాలో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దట్టమైన పొగ మంచు మధ్యలో కారును ట్రక్కు ఓవర్ టేక్ చేయబోయింది. ఈ క్రమంలో ట్రక్కు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను రాజ్‌ఘర్ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో భార్యాభర్తలు, వారి కూతుళ్లు ఇద్దరు ఉన్నారు.
Here's News
In a tragic incident, four members of a family were killed and two sustained grave injuries after a scrap-laden truck fell on their car in #MadhyaPradesh’s Guna district early on Tuesday.
Reports suggested that the truck was carrying more than 40 tonnes of scrap and the moment… pic.twitter.com/3796ZO0aAX
— IANS (@ians_india) December 26, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)