మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో కృష్ణ డోంగ్రే అనే రైతు తాను పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కోపంతో సుమారు 1.5 ఎకరాల ఉల్లి పంటకు నిప్పంటించాడు. ఆ పంట కోసం అని సుమారు రూ. 1.5 లక్షలు ఖర్చు పెట్టానని, ఆ తర్వాత వాటి రవాణా కోసం సుమారు రూ. 30 వేలు అదనంగా ఖర్చు చేశానని వాపోయాడు. ఇంత చేస్తే చివరికి ఉల్లి ధర మార్కెట్లో కేవలం రూ. 25 వేలు పలుకుతోందంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.కనీసం మమ్మల్ని మీరు ఇలా చేయకండి మేము ఆదుకుంటామన్న భరోసా కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ మేరకు రైతు కృష్ణ ఈ ఉల్లి దహనోత్సవానికి రావాల్సిందిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు రక్తంతో కూడా ఓ లేఖ రాశానని చెప్పారు. ప్రభుత్వం తమ పంటలన్నింటిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశాడు. అలాగే ప్రస్తుత నష్టాలకు గానూ అందరికీ క్విటాకు వెయ్యి రూపాయల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని డ్రోంగే కోరాడు.
Here's Video
Angry Farmer Burns Onion Crop, Invites Eknath Shinde, Writes In Blood https://t.co/lpCk293OJq pic.twitter.com/5yZTFPW36s
— NDTV (@ndtv) March 6, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)