New Delhi, Sep 16: ఢిల్లీలో మంకీపాక్స్ 8వ కేసు నమోదైంది. 30 ఏళ్ల నైజీరియా మహిళకు మంకీపాక్స్ పాజిటివ్‌గా శుక్రవారం నిర్ధారణ అయ్యింది. లోక్ నాయక్ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నది. మంకీపాక్స్ సోకిన మరో నైజీరియా మహిళ కూడా ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఈ వ్యాధి లక్షణాలున్న మరో వ్యక్తి కూడా ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ఈ ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అన్నారు. దీంతో ఢిల్లీలో మంకీపాక్స్ కేసుల సంఖ్య 8కి చేరిందని అధికారులు వెల్లడించారు.
మరోవైపు దేశంలో మంకీపాక్స్ కేసుల సంఖ్య 13కు పెరిగింది. ఇందులో 8 కేసులు ఢిల్లీలో నమోదయ్యాయి. మరో ఐదు కేసులు కేరళలో వెలుగు చూశాయి.దేశంలో తొలి కేసు ఈ ఏడాది జూలై 14న కేరళలోని కొల్లాం జిల్లాలో నమోదైంది.
Nigerian woman in Delhi tests positive for monkeypox, admitted to LNJP Hospital; India's tally rises to 13: Sources
— Press Trust of India (@PTI_News) September 16, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)