పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రెండో రోజు కూడా మణిపూర్ అంశంపై దద్దరిల్లింది. ఇటీవల విడుదలైన వీడియోలపై స్పందించాలని కేంద్రాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. కానీ కేంద్రం ఎలాంటి అవకాశం ఇవ్వలేదని తెలిపారు. మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ సభలోపల మాట్లాడాలని డిమాండ్ చేశారు.

పార్లమెంట్‌లో మణిపూర్‌పై నిరసన నేపథ్యంలో లోక్‌సభలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది. ఇక మణిపూర్‌ అంశంపై రాజ్యసభలో కూడా గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ కూడా సోమవారానికి వాయిదా పడింది. కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌.. విపక్షాలకు నచ్చచెప్పే యత్నం చేసినా విపక్షాలు ఆందోళన కొనసాగాయి. దాంతో లోక్‌సభను వాయిదా వేయక తప్పలేదు

Parliament Monsoon Session

ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)