ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ మ‌ద‌ర్ డెయిరీ (Mother Dairy) పాల ధ‌ర‌లను (increased prices) రెండు రూపాయలు పెంచేసింది. అన్ని రకాల ఉత్పత్తులపై రూ.2 మేర ధరలు పెంచినట్లు మదర్‌ డెయిరీ సోమవారం తెలిపింది. గత 15 నెలలుగా ఇన్‌పుట్ కాస్ట్ పెర‌గ‌డంతో పాల ధ‌ర‌లు పెంచ‌క త‌ప్పలేద‌ని పేర్కొంది. పెరిగిన ధరలు ఢిల్లీ ఎన్ సీఆర్ పరిధిలో సోమవారం నుంచే (జూన్‌ 3) అమల్లోకి వస్తాయని తెలిపింది. అయితే దేశ వ్యాప్తంగా ఈ ధరలు అమల్లోకి వస్తాయా లేదా అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు.

తాజా పెంపుతో టోకెన్ మిల్క్ (బ‌ల్క్ వెండెడ్ మిల్క్‌) లీట‌ర్ ధ‌ర రూ.2 పెరిగి రూ.52 నుంచి రూ.54కు చేరింది. అదే సమయంలో టోన్డ్‌ మిల్క్‌ లీటర్‌ ధర రూ.54 నుంచి రూ.56కు, ఆవు పాల ధర రూ.56 నుంచి రూ.58కి, ఫుల్‌ క్రీమ్‌ మిల్క్‌ ధర రూ.66 నుంచి రూ.68కి, గేదె పాలు లీటరు ధర రూ.70 నుంచి రూ.72కు డబుల్‌ టోన్డ్‌ మిల్క్‌ ధర రూ.48 నుంచి రూ.50కి పెరిగింది.

Here's News

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)