బ్లాక్‌ ఫంగస్‌ (మ్యూకోర్‌మైకోసిస్‌) మెల్లిగా విస్తరిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 8,848 బ్లాక్ ఫంగస్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర మంత్రి స‌దానంద గౌడ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు. ఈ రోగుల‌కు 23 వేల అంఫోటెరిసిన్-బీ వ్యాక్సిన్ వ‌య‌ల్స్‌ను ఆయా రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాల‌కు పంపామ‌ని తెలిపారు. గుజ‌రాత్‌లో అత్య‌ధికంగా 2,281 కేసులు న‌మోదు కావ‌డంతో ఆ రాష్ట్రానికి 5,800 వ‌య‌ల్స్ పంపిణీ చేసిన‌ట్లు పేర్కొన్నారు. మ‌హారాష్ర్ట‌కు 5,090 వ‌య‌ల్స్, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు 2,300 వ‌య‌ల్స్, తెలంగాణ‌కు 890 వ‌య‌ల్స్ ఢిల్లీకి 670 వ‌య‌ల్స్ కేటాయించామ‌న్నారు. ఏపీలో 910, తెలంగాణ‌లో 350 కేసులు న‌మోదు కాగా, ఢిల్లీలో 197 కేసులు న‌మోదు అయ్యాయి.

కాగా బ్లాక్ ఫంగస్‌ చికిత్సకు వినియోగించే అంఫోటెరిసిన్-బీ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసేందుకు మరో కొత్తగా ఐదు ఫార్మా కంపెనీలకు అనుమతి లభించిందని, మూడు రోజుల్లో అన్ని రకాల అనుమతులు మంజూరు చేయనున్నట్లు నిన్న కేంద్రం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అలాగే అంఫోటెరిసిన్‌-బీ ఆరు లక్షల ఇంజక్షన్ల దిగుమతికి భారతీయ కంపెనీలు ఆర్డర్‌ ఇచ్చినట్లు తెలిపింది.

Here's  Sadananda Gowda Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)