యూపీ గ్యాంగ్‌స్టర్‌, మాజీ ఎమ్మెల్యే ముక్తార్‌ అన్సారీ(Mukhtar Ansari) మృతిపై ఆయన కుమారుడు ఉమ‌ర్ అన్సారీ సంచలన ఆరోపణలు చేశారు. నా తండ్రి ముక్తార్ అన్సారీకి జైలులో విష ప్ర‌యోగం జ‌రిగింద‌ని తెలిపారు. త‌న‌కు స్లో పాయిజ‌నింగ్ జ‌రుగుతున్న‌ట్లు త‌న తండ్రి చెప్పాడ‌ని ఉమ‌ర్ అన్సారీ మీడియాతో పేర్కొన్నాడు.యావ‌త్ దేశానికి ఈ విష‌యం తెలుసు అని అత‌ను తెలిపాడు.

ముక్తార్ అన్సారీ సోద‌రుడు, ఘాజిపూర్ ఎంపీ అఫ్జ‌ల్ అన్సారీ కూడా ముక్తార్‌పై విష ప్ర‌యోగం జ‌రిగిన‌ట్లు ఆరోపించాడు. శుక్ర‌వారం ముక్తార్ ఇంటి వ‌ద్ద భారీ సంఖ్య‌లో జ‌నం చేరుకున్నారు. భ‌ద్ర‌తా ద‌ళాల‌ను కూడా భారీగా మోహ‌రించారు. అయితే ఉమ‌ర్ చేసిన ఆరోప‌ణ‌ల‌ను జైలు అధికారులు ఖండించారు. బాందా జైలులో ఖైదీగా ఉన్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో జైలు అధికారులు ఆస్పత్రికు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. గ్యాంగ్ స్ట‌ర్ ముక్తార్ అన్సారీ మృతి, గుండెపోటుతో మ‌ర‌ణించిన‌ట్లు వెల్ల‌డించిన జైలు అధికారులు, 5 సార్లు అసెంబ్లీకి ఎన్నికైన ముక్తార్ మాజీ ఉప‌రాష్ట్రప‌తికి సోద‌రుడు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)