రాత్రిపూట రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.నిద్రలేమి, అలసిపోయి ఉన్న లారీ డ్రైవర్లకు ఉచితంగా టీ పంపిణీ చేయడం ద్వారా వారిలో నిద్రమత్తు వదిలించి ఉత్తేజ పరచాలని నిర్ణయించింది. హైవేల పక్కన ఉన్న దాబాలు, హోటళ్లలో లారీ డ్రైవర్లకు ఉచితంగా టీ అందించాలని ఒడిశా ప్రభుత్వం సూచించింది.
ఈ పథకం అమలులో భాగంగా తొలుత రోజూ రాత్రి 3 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు ఫ్రీ ఛాయ్ ఇవ్వనున్నట్లు చెప్పింది. ఆ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేసింది. లారీ డ్రైవర్లు టీ తాగిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకునేలా కూడా హైవేల పక్కన ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. 30 జిల్లాల్లో లారీ టెర్మినల్స్ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. వాటిలో నిద్రపోవడానికి, స్నానాలు చేయడానికి సౌకర్యాలు ఉంటాయని చెప్పారు.
Here's News
Odisha government takes initiative of distributing free tea to drivers to mitigate road accidentshttps://t.co/t67HfVX9IS
— SRK Nation (@SRKNation2023) December 22, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)