ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric)’ దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ మోటారు సైకిల్ వచ్చే ఏడాది మార్కెట్లోకి తీసుకొస్తామని ప్రకటించింది. ఓలా ఐపీఓ ప్రకటనపై బోర్డు ఆఫ్ డైరెక్టర్లతో కలిసి జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.2025 తొలి ఆరు నెలల్లో తొలి మోటార్ సైకిల్ మార్కెట్లోకి తీసుకొస్తామని తెలిపారు. ఆగస్టు 15న జరిగే ఈవెంట్‌లో మోటారు సైకిళ్ల మోడల్స్, ఇతర వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఓలా ఎస్1 ప్రో, ఓలా ఎస్1 ఎయిర్, ఓలా ఎస్1ఎక్స్ వంటి ఈవీ స్కూటర్లను మార్కెట్లో ఆవిష్కరించారు. తాము సొంతంగా తయారు చేసే ఈవీ బ్యాటరీల సాయంతో ఎలక్ట్రిక్ మోటారు సైకిళ్లను అభివృద్ధి చేస్తామని భవిష్ అగర్వాల్ సోమవారం మీడియాకు చెప్పారు. వచ్చే ఏడాది నుంచి తాము తమ సంస్థలో తయారుచేసిన బ్యాటరీలను మాత్రమే ఈవీ స్కూటర్లు, ఈవీ మోటారు సైకిళ్లలో వినియోగిస్తామని తెలిపారు. అమ్మకాల్లో దూసుకుపోతున్న మారుతి సుజుకి గ్రాండ్ విటారా, 23 నెలల్లో 2 లక్షల సేల్స్‌తో సరికొత్త రికార్డు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)