గత 24 గంటల్లో దేశంలో 9,195 కరోనా కేసులు (COVID19 cases) నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. నిన్న 7,347 మంది కరోనా నుంచి కోలుకున్నారని వివరించింది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 77,002 మంది చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,42,51,292గా ఉందని పేర్కొంది.
ఇప్పటివరకు దేశంలో 67.52 కోట్ల కరోనా పరీక్షలు చేశారు. మొత్తం 143.15 కోట్ల డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. కాగా, దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య (Omcrion in India) క్రమంగా పెరిగిపోతోంది. ఇప్పటివరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 781గా (New Variant cases in India) ఉంది. తెలంగాణలో మొత్తం 62 ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా, వారిలో 10 మంది కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆరు ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా, ఒక్కరు కోలుకున్నారు.
781 Omicron cases in India so far. 9,195 new COVID19 cases reported in the last 24 hours, active caseload at 77,002 pic.twitter.com/T856yGqZ0k
— ANI (@ANI) December 29, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)