మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) సీహోర్‌ (Sehore) జిల్లాలో చిన్నారి 300 అడుగుల లోతున్న బోరువావిలో పడిపోయింది. ముగవాళి (Mugavali) గ్రామానికి చెందిన శృష్టి కుశ్వాహా (Srishti Kushwaha) అనే రెండున్నరేండ్ల బాలిక ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు వెళ్లి బోరుబావిలో (Borewell) పడినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారిని రక్షించేందుకు రెవెన్యూ, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం (NDRF), పోలీసు సిబ్బంది ఆపరేషన్‌ శృష్టి (Operation Srishti) పేరుతో ఆపరేషన్‌ మొదలుపెట్టారు.జేసీబీ, ఇతర యంత్రాలతో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం బోరుబావికి సమాంతరంగా గుంత తొవ్వడం ప్రారంభించారు. చిన్నారిని సుమారు 30 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించామన్నారు.

అయితే గత 17 గంటలుగా కొనసాగుతన్న ఆపరేషన్‌కు బ్రేక్‌ పడింది. డ్రిల్లింగ్‌ చేయడంతో బాలిక మరో 20 ఫీట్ల లోతుకు జారినట్లు అధికారులు గుర్తించారు. ఈనేపథ్యంలో తొవ్వకం పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం ఆ చిన్నారి 50 ఫీట్ల లోతువద్ద ఉన్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్ (CM Shivraj Singh Chouhan)‌.. ఈ ఘటనపై ఆరా తీశారు. తన సొంత జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో.. సహాయక చర్యలను వేగవంతం చేయాలని, చిన్నారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

CM Tweet

Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)