మూడేళ్ల లోపు పిల్లలను బలవంతంగా ప్రీ స్కూల్ కు పంపించడం చట్టవిరుద్ధమైన చర్యగా పేర్కొంటూ గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఒకటో తరగతిలోకి ప్రవేశం పొందాలంటే వయసు ఆరేళ్లు నిండాలంటూ ఇటీవల గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని సవాలు చేస్తూ పలు పిటిషన్లు దాఖలు కాగా, వాటిపై హైకోర్టు విచారణ నిర్వహించింది. 2023 జూన్ 1 నాటికి ఆరేళ్ల వయసు నిండని తల్లిదండ్రులు ప్రభుత్వ నోటిఫికేషన్ ను సవాలు చేశారు.

దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం..జూన్ 1 నాటికి మూడేళ్ల వయసు పూర్తి చేసుకోని విద్యార్థులను ప్రీ స్కూల్స్ చేర్చుకోరాదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మూడేళ్ల పాటు ప్రీ స్కూల్ విద్య, సంరక్షణ అనేవి మొదటి తరగతిలో ప్రవేశానికి చిన్నారులను సిద్ధం చేసినట్టు అవుతుందని పేర్కొంది.

 Here's News

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)