పెగాసస్ స్పైవేర్ వివాదంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పెగాసస్ నిఘా స్కామ్‌ను పరిశీలిస్తున్న ముగ్గురు సభ్యుల కమిటీకి తమ రిపోర్ట్‌ను సమర్పించేందుకు అదనపు సమయాన్ని కోర్టు కేటాయించింది. సీజేఐ ఎన్వీ రమణ, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. నిపుణుల కమిటీ ఇప్పటి వరకు 29 మొబైల్ ఫోన్లను పరిశీలించినట్లు తెలుస్తోందని, ప్రక్రియను పూర్తి చేసేందుకు వాళ్లకు మరింద అదనపు సమయాన్ని కేటాయిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. టెక్నికల్ కమిటీ తమ ప్రక్రియను నాలుగు వారాల్లోగా పూర్తి చేస్తుందని, సూపర్‌వైజరీ జడ్జికు రిపోర్ట్ అందిన తర్వాత జూలైలో ఈ కేసును మళ్లీ విచారిస్తామని కోర్టు పేర్కొన్నది.
Pegasus Row: 29 Phones Examined, SC-Appointed Panel To Submit Pegasus Probe Report by May End#Pegasus #SupremeCourt #PegasusProbe #Spyware https://t.co/yAEoUP4TRx
— LatestLY (@latestly) May 20, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)