దేశంలోని 23 జాతుల క్రూరమైన శునకాల పెంపకంపై నిషేధం విధిస్తూ గురువారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పిట్‌బుల్ టెర్రియర్, అమెరికన్ బుల్‌డాగ్, రోట్‌వీలర్, మాస్టిఫ్‌ సహా 23 జాతుల కుక్కల అమ్మకం, పెంపకాన్ని నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది.ఇప్పటికే పెంపుడు జంతువులుగా ఉన్న ఈ జాతి కుక్కలను స్టెరిలైజ్ చేయాలని, సంతానోత్పత్తి జరగకుండా చూడాలని కేంద్రం సూచించింది.

నిషేధించిన కుక్కల జాబితాలో పిట్‌బుల్ టెర్రియర్, టోసా ఇను, అమెరికన్ స్టాఫోర్డ్‌షైర్ టెర్రియర్, ఫిలా బ్రసిలీరో, డోగో అర్జెంటీనో, అమెరికన్ బుల్‌డాగ్, బోర్‌బోయెల్ కంగల్, సెంట్రల్ ఏషియన్ షెపర్డ్ డాగ్, కాకేసియన్ షెపర్డ్ డాగ్ వంటి జాతుల శునకాలు ఇందులో ఉన్నాయి. ఇతర జాతులలో సౌత్ రష్యన్ షెపర్డ్ డాగ్, టోర్ంజక్, సర్ప్లానినాక్, జపనీస్ టోసా, అకిటా, మాస్టిఫ్స్, టెర్రియర్స్, రోడేసియన్ రిడ్జ్‌బ్యాక్, వోల్ఫ్ డాగ్స్, కానరియో, అక్బాష్ డాగ్, మాస్కో గార్డ్ డాగ్, కేన్ కోర్సో, బాండోగ్ ఉన్నాయి. నిషేధించిన శునకాలను పెంచుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది.

Here's News

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)