దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం (డీఎండీకే) వ్యవస్థాపక అధ్యక్షుడు విజయకాంత్‌ను తల్చుకుని దేశ ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. కొన్నిరోజుల కిందటే.. విజయకాంత్ గారిని మనం కోల్పోయాం. ఆయన సినీ ప్రపంచంలో మాత్రమే కెప్టెన్ కాదు.. రాజకీయ రంగంలో కూడా కెప్టెనే. సినిమాల ద్వారా అశేష ప్రజాభిమాన సంపాదించుకున్న విజయకాంత్.. ఒక నేతగా రాజకీయం కంటే దేశ ప్రయోజనమే ముఖ్యమనుకునేవారు.. అని ప్రధాని మోదీ విజయకాంత్‌ను కొనియాడారు.

ఆయన మరణం తమిళ భూమికి.. దేశానికి తీరని లోటు అని పేర్కొంటూ.. విజయకాంత్ కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంగళవారం తిరుచిరాపల్లిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. అక్కడ కెప్టెన్‌ విజయకాంత్‌ ప్రస్తావన తెచ్చి మరీ నివాళులర్పించారు. అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ డిసెంబర్‌ 28వ తేదీన కన్నుమూశారు విజయకాంత్‌(71). ఆ సమయంలో ఎక్స్‌ వేదికగా ప్రధాని మోదీ సైతం సంతాపం ప్రకటించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)