భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీ జాతినుద్దేశించి మాట్లాడతారంటూ ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో) ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. దేశంలో కొవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌పై ప్రధాని మోదీ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

దేశ వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో దశల వారీగా అన్‌లాక్ ప్రక్రియ గురించి కూడా ప్రధాని మాట్లాడే అవకాశం ఉంది. ప్ర‌స్తుతం దేశంలో కొవిడ్ రెండో ద‌శ త‌గ్గుముఖం పట్టిన‌ట్లే క‌నిపిస్తోంది. కేసులు రెండు నెల‌ల క‌నిష్ఠానికి ప‌డిపోయాయి. మ‌రోవైపు త‌మ ప్ర‌భుత్వ వ్యాక్సినేష‌న్ పాల‌సీపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో మోదీ దానిపై కూడా మాట్లాడ‌తార‌ని స‌మాచారం. సుప్రీంకోర్టు కూడా వ్యాక్సిన్ పాల‌సీపై ప్ర‌భుత్వంపై వ్యక్తం చేసింది. దాని కోసం బ‌డ్జెట్‌లో కేటాయించిన 35 వేల కోట్లు ఏమ‌య్యాయ‌ని కూడా ప్ర‌శ్నించింది. వీటిపై ప్ర‌ధాని త‌న ప్ర‌సంగంలో వివ‌ర‌ణ ఇచ్చే అవ‌కాశాలు ఉన్నాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)