Varanasi, December 14: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని వార‌ణాసి ప‌ట్ట‌ణంలో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ఈ ఉద‌యం సమావేశ‌మ‌య్యారు. ఈ స‌మావేశానికి బీజేపీ జాతీయాధ్య‌క్షుడు జ‌గ‌త్ ప్ర‌కాష్ న‌డ్డా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగీ ఆదిత్యనాథ్‌, హ‌ర్యానా ముఖ్య‌మంత్రి మ‌నోహ‌ర్‌లాల్ క‌ట్ట‌ర్, ఉత్త‌రాఖండ్ ముఖ్య‌మంత్రి పుష్క‌ర్‌సింగ్ ధామి, అసోం ముఖ్య‌మంత్రి హిమాంత బిశ్వ‌శ‌ర్మ‌, క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి బ‌స‌వ‌రాజ్ బొమ్మై స‌హా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రులంద‌రూ హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా ఆయా రాష్ట్రాల్లో ప‌రిస్థితులు, రాజ‌కీయ ప‌రిణామాల గురించి ప్ర‌ధాని ముఖ్య‌మంత్రుల‌ను అడిగి తెలుసుకున్నారు. ప‌లు సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుతీరు, ప్ర‌జ‌ల్లో స్పంద‌న గురించి ఆరా తీశారు. కేంద్ర ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు గురించి ప‌లు స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇచ్చారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్ అసెంబ్లీ ఎన్నిక‌ల అంశం కూడా ఈ స‌మావేశంలో చ‌ర్చకు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)