పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామికి కరోనా పాజిటివ్ వచ్చింది. స్వల్ప లక్షణాలతో ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆదివారం ఇందిరాగాంధీ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో కరోనా పరీక్ష చేయించుకోగా.. ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయనకి చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.కాగా ఈనెల 7న రంగస్వామి పుదుచ్చేరి సీఎంగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే.

పుదుచ్చేరి 20వ ముఖ్యమంత్రిగా ఎన్‌. రంగస్వామి

పుదుచ్చేరి 20వ ముఖ్యమంత్రిగా ఎన్‌. రంగస్వామి పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇన్‌చార్జ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. రంగస్వామి తమిళ భాషలో దేవుడ్ని స్మరిస్తూ ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగో సారి. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, 30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి ద్వారా పోటీ చేసిన ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ 10, బీజేపీ 6 సీట్లను గెలుపొంది ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ను సాధించిన సంగతి తెలిసిందే.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)