మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి (Maharashtra Landslides). రాయ్‌గడ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకోగా 16 మంది మరణించారు. సుమారు 48 కుటుంబాలకు చెందిన వందలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. గురువారం తెల్లవారుజామున ఇర్షల్వాడి గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయి.
దీంతో ఇళ్లలో నిద్రిస్తున్న వారిలో 16 మంది చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. సుమారు 48 కుటుంబాలు నివసిస్తున్న ఇండ్లు కూలిపోయాయి. శిథిలాల నుంచి 12 మృతదేహాలను వెలికి తీశారు. రెస్క్యూకు చెందిన ఒక వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. సుమారు వందల మంది శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. 21 మందిని అధికారులు రక్షించారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
Here's ANI Tweet
Raigad landslide Update | Owning to heavy rainfall and the threat of further landslide in the dark, the rescue operation has been called off with consultation of Local Administration and will resume tomorrow morning. The final figure for today is 16 dead bodies recovered and 21…
— ANI (@ANI) July 20, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)