బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. తాజాగా ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన స్పందనను తెలియజేశారు. "తెలుగు సినీ పరిశ్రమ క్రియేటివిటికి, టాలెంట్‌కి, ఫ్రోఫెషనలిజంకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. నేను ఇలాంటి ఓ గొప్ప తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నందుకు సంతోషంగా వున్నాను. ఇక్కడ నాది ఎంతో అందమైన గొప్ప ప్రయాణం. నాకు ఈ పరిశ్రమతో ఎంతో గొప్ప అనుబంధం వుంది. ఈ రోజున ఇలాంటి నిరాధారమైన, దుర్మార్గమైన పుకార్లు నాతోటి నటీనటులపై మహిళలపై పుట్టించడం ఎంతో బాధాకరం. ఇలాంటి వ్యాఖ్యలను ఎంతో బాధ్యతాయుతమైన స్థానంలో వున్న మరో మహిళ చేస్తోంది.

హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం కేటీఆర్‌కు అలవాటే, కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు, సమంత, నాగచైతన్య విడిపోవడానికి కారణం అతడే అంటూ..

అనవసరమైన పుకార్లకు స్పందించకుండా మౌనంగా ఉండటం అనేది మన బలహీనతగా అనుకుంటారు. నేను పూర్తిగా రాజకీయాలకు సంబంధం లేని మనిషిని, నాకు ఏ రాజకీయ పార్టీతో, పొలిటికల్‌ లీడర్‌తో సంబంధం లేదు. నా పేరును మీ రాజకీయాల కోసం, మీ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం మానేయమని కోరుతున్నానని తెలిపారు. దయచేసి సినిమా తారలను, కళాకారులను రాజకీయ పుకార్ల నుంచి దూరంగా వుంచండి. మా పేర్లకు కల్పిత కథలను జోడించి ప్రచారం చేయకండి.. మీరు హెడ్‌లైన్‌లో వుండటానికి మా మీద ఇలాంటి చవకబారు వ్యాఖ్యలను చేయకండి' అని తన ట్విట్టర్‌ (ఎక్స్‌) అకౌంట్‌లో రాసుకొచ్చారు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.

Here's Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)