రస్నా వ్యవస్థాపకుడు అరిజ్ పిరోజ్‌షా ఖంబట్టా కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో అహ్మదాబాద్‌లో మరణించినట్లు ప్రకటించింది. అరిజ్ ఖంబట్టా బెనివలెంట్ ట్రస్ట్, రస్నా ఫౌండేషన్‌కు ఛైర్మన్‌గా కూడా ఉన్నారు.85 సంవత్సరాల వయస్సులో తిరిగి రాని లోకాలకు వెళ్లారు.

ఐకానిక్‌ డ్రింక్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన మిమ్మల్ని మరువలేం.. మిస్‌ యూ సార్‌ అంటూ అభిమానులు ఆయనకు నివాళి అర్పిస్తున్నారు.అలాగే పలువురు వ్యాపార దిగ్గజాలు ఖంబట్టా మృతిపై సంతాపం ప్రకటించారు.1980-90లలో ఏ నోట విన్నా ‘ఐ లవ్‌ యూ రస్నా’ అన్న మాట వినబడేది. ఫంక్షన్‌ ఏదైనా, సందర్భంగా ఏదైనా రస్నా నాలేని పార్టీ లేదంటే అతిశయోక్తి కాదు.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)