భారత వ్యాపార దిగ్గజం రతన్ టాటా ఆరోగ్యం క్షీణించిందటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దాంతో వ్యాపార వర్గాల్లో కలకలం బయల్దేరింది.ఈ నేపథ్యంలో, రతన్ టాటా స్వయంగా స్పందించారు. ఎక్స్ లో ఓ ప్రకటన విడుదల చేశారు. "నా ఆరోగ్యం గురించి ఇటీవల వస్తున్న పుకార్లు నా దృష్టికి వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని అందరికీ తెలియజెప్పాలనుకుంటున్నాను. నా వయసు రీత్యా, ఆరోగ్య రీత్యా ప్రస్తుతం కొన్ని వైద్యపరమైన పరీక్షలు చేయించుకుంటున్నాను. ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. నేను ప్రస్తుతం ఉల్లాసంగానే ఉన్నాను. తప్పుడు సమాచారం వ్యాప్తి చేయవద్దని ప్రజానీకాన్ని, మీడియాను కోరుతున్నాను" అంటూ రతన్ టాటా ట్వీట్ చేశారు. అంతేకాదు, తన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్న వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

విక్టర్‌ ఆంబ్రోస్‌, గ్యారీ రవ్‌కున్‌కు నోబెల్‌, మైక్రో ఆర్‌ఎన్‌ఏ, పోస్ట్‌ ట్రాన్‌స్ర్కిప్షనల్‌ జీన్‌ రెగ్యులేషన్‌లో దాని పాత్రను కనుగొన్నందుకు గుర్తింపుగా పురస్కారం

Here's Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)