కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా అరుణ్ గోయల్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కమిషనర్ గా అరుణ్ గోయల్ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం లభించినట్టు వెల్లడించింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. అరుణ్ గోయల్ 1985 బ్యాచ్ కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఆయన సర్వీసులో ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) తీసుకున్నారు. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ గా రాజీవ్ కుమార్ వ్యవహరిస్తున్నారు. ఆయన గత మే నెలలోనే సీఈసీ పదవీ బాధ్యతల్లోకి వచ్చారు.
रिटायर्ड आईएएस अधिकारी अरुण गोयल को नया चुनाव आयुक्त नियुक्त किया गया है.
पूरी ख़बर- https://t.co/EeE3MXVM10 pic.twitter.com/3dRa2I3psb
— BBC News Hindi (@BBCHindi) November 19, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)