సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ భారీ ట్రక్కు రోడ్డు మధ్యలో వెనకకు వచ్చింది. అయితే ఇదేమి పట్టించుకోకుండా ఓ బైకర్ దాని దగ్గరకు వెళ్లాడు. అయితే ట్రక్కు వెనకకు రావడంతో అతను అక్కడి నుంచి వెనకకు రాలేక దాని కింద పడిపోయాడు. భారీ ట్రక్కు ఆ బైకును తొక్కుకుంటూ వెనకకు వచ్చింది. షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, భారీ వాహనం కిందపడి తృటిలో చావు నుండి తప్పించుకున్న బైక్ రైడర్, వీడియో ఇదిగో..
కొద్ది దూరం వచ్చి మళ్లీ ముందుకు వెళ్ళింది. అయితే బైకు మీద ప్రయాణిస్తున్న వారు అప్పటికే దాని కింద పడిపోయారు. దీనికి సంబంధించిన వీడియోని బిగ్ టీవీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎక్కడికైనా 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్తే కొంపలు ఏమి మునిగిపోవంటూ కొటేషన్ ఇచ్చింది. అయితే ఈ ప్రమాదం ఎక్కడ జరిగిందనే దానిపై అధికారికి సమాచారం ఇంకా అందలేదు.
Here's Video
ఎక్కడికైనా 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్తే కొంపలు ఏమి మునిగిపోవు, ఒక వాహనానికి వెనుకవైపు ప్రయాణం చేసేటప్పుడు కనీసం 15 అడుగుల దూరంలో మీ వాహనాన్ని నిలపండి. ఒక చిన్న తప్పు అది మన ప్రాణానికి హాని కలిగించకూడదు#roadaccident #trucks #heavyvehcles #latestnews #bigtv pic.twitter.com/Go5QiBpS9h
— BIG TV Breaking News (@bigtvtelugu) July 4, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)