కర్ణాటక విద్యా సంస్థల్లో ముస్లిం బాలికలు హిజాబ్‌ ధరించటాన్ని నిషేధిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు వాయిదా వేసింది. కర్ణాటకలోని ఉడుపిలో ప్రభుత్వ కాలేజీల్లో హిజాబ్‌ ధరించటాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. దీనిపై కళాశాల విద్యార్థులు హైకోర్టుకు వెళ్లగా ప్రభుత్వ నిర్ణయం సరైనదేనని మార్చి 15న హైకోర్టు తీర్పు ఇచ్చింది. హిజాబ్‌ ధరించటం తప్పనిసరి మతపరమైన ఆచారం కాదని పేర్కొంది. దీంతో హైకోర్టు తీర్పును పలువురు విద్యార్థులు సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. అన్ని పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్టు గురువారం ప్రకటించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)