తమిళనాడులో భారీ వర్షాలకు తిరునెల్‌వెలి జిల్లాలో ఉన్న తామ్రపార్ని నది(Tamraparni River) ఉప్పొంగుతున్నది. ఆ నది పరివాహక ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరుకున్నది. వరద నీటి వల్ల తిరునెల్‌వలి పట్టణంలో అనేక బిల్డింగ్‌లు మునిగాయి. నదీ పరివాహక ప్రాంతంలో సుమారు 20 వేల మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. తామ్రపార్ని నది నుంచి దాదాపు 1.2 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలో కలుస్తోంది. టూటికోరిన్‌లోని శ్రీవైకుంఠంలో అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. కానీ ఎవరి ప్రాణాలు కూడా డేంజర్‌లో లేవని అధికారులు చెబుతున్నారు. ఆహార పొట్లాలను సరఫరా చేస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా వరద నీటిలో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నట్లు టూటికోరిన్ జిల్లా కలెక్టర్ లక్ష్మీపతి తెలిపారు.
Here's Rain Videos
#WATCH | Tamil Nadu: Several structures submerged as the Tamraparni River in Tirunelveli is flooded due to heavy rains pic.twitter.com/SJxwMfEgoq
— ANI (@ANI) December 20, 2023
#WATCH | Tamraparni river flowing through Tirunelveli flooded due to heavy rains in the last few days#TamilNadu pic.twitter.com/cM3ykY69tu
— ANI (@ANI) December 20, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)