ఎయిర్‌ ఇండియాకు కొత్త సీఈవో ఎండీని నియమిస్తూ టాటా సన్స్‌ నిర్ణయం తీసుకుంది. 2022 ఫిబ్రవరి 14న జరిగిన బోర్డు సమావేశంలో ఐకెర్‌ ఆయ్‌సీని కొత్త బాస్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటి వరకు టర్కీ ఎయిర్‌వేస్‌కి చీఫ్‌గా ఐకెర్‌ ఆయ్‌సీ ఉన్నారు. 2022 ఏప్రిల్‌ 1 నుంచి ఆయన ఎయిరిండియా చీఫ్‌గా బాధ్యతలు చేపడతారు. బిల్‌కెంట్‌ యూనివర్సిటీ నుంచి పబ్లిక్‌ అడ్మినిష్టేషన్‌ పట్టాను 1994లో పొందరు ఐకర్‌ ఆయ్‌సీ. అనంతరం యూకేలని లీడ్స్‌ యూనివర్సిటీ నుంచి పొలిటికల్‌ సైన్స్‌లో పట్టా సాధించారు. టర్కీ ఫుడ్‌ ఫెడరేషన్‌ బోర్డ్‌ మెంబర్‌గా కూడా ఐకెర్‌ ఉన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)