ఒడిశాలోని డెంకనాల్ జిల్లాలోని కంటామనియాలోని టాటా స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కంపెనీలోని స్టీమ్ పైప్ పగిలిపోయింది. దీంతో అక్కడ విధుల్లో ఉన్న 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్లాంట్‌లో ఉన్న హెల్త్ సెంటర్‌లో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం కటక్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. స్టీమ్ పైపు పగిలిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ధృవీకరించారు.మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఈ ప్రమాదం సంభవించినట్లు కంపెనీ యాజమాన్యం వెల్లడించింది. ప్లాంట్‌లో తనిఖీలు జరుగుతున్న సమయంలో స్టీమ్ పైపు పగిలిపోయిందన్నారు. గాయపడ్డ వారిలో ఉద్యోగులు, కార్మికులు ఉన్నారని తెలిపారు.
IANS Tweet
At least 19 persons were injured in an accident at the Tata Steel plant at Meramandali in #Odisha's Dhenkanal district.
Dhenkanal SP Gyanaranjan Mohapatra said a valve carrying hot water got opened and 19 persons were injured in the incident. pic.twitter.com/3pBhRsJlvJ
— IANS (@ians_india) June 13, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)