ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎన్టీఆర్‌ జిల్లాలో మున్నేరు నది ఉధృతంగా ప్రవహిస్తుంది. నందిగామ నియోజకవర్గం ఐతవరం గ్రామసమీపంలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై(హైదరాబాద్‌-విజయవాడ)అడుగు మేర వరద నీరు చేరింది. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు స్తంభించాయి. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వచ్చే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వన్‌వేలోనే ట్రాఫిక్‌ను పోలీసులు మళ్లిస్తున్నారు.

ఇక కంచికచర్ల మండలం కీసర వద్ద మున్నేరు, వైరా ఏరు, కట్టలేరు వరద ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై కీసర వంతెన వద్ద ఈ మూడు నదులు కలిసి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సమయం గడుస్తున్నా కొద్ది వరద మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఐతవరం దగ్గర పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో ముందస్తుగా టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను పోలీసులు నిలిపివేశారు.

దీంతో వందలాది వాహనాలు జాతీయ రహదారిపై నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. కొందరు వాహనదారులు వరద నీటిలోనే తమ వాహనాలను ముందుకు నడిపిస్తున్నారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐతవరం వద్ద పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తున్నారు.

services between Vijayawada and Hyderabad Due to Heavy Rains

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)