విమానంలో మందుబాబులు రచ్చ రచ్చ చేశారు. దుబాయ్ నుంచి ముంబై వచ్చిన ఇండిగో విమానంలో ఇద్దరు ప్యాసింజర్లు మద్యం మత్తులో తోటి ప్రయాణికులను హడలెత్తించారు. వీరిని డ్డుకోబోయిన విమాన సిబ్బందిని కూడా లెక్కచేయకుండా దుర్భాషలాడారు. మద్యం బాటిళ్లను వారి వద్ద నుంచి తీసేసేందుకు ప్రయత్నించగా.. గొడవకు దిగారు.
ఈ ప్యాసింజర్లను దత్తాత్రేయ బపార్డేకర్, జాన్ జార్జ్ డిసౌజాగా గుర్తించారు. యాజమాన్యం వీరిపై ఫిర్యాదు చేయడంతో విమానం ముంబైలో ల్యాండ్ అయిన వెంటనే పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు. ఆ తర్వాత వారు బెయిల్‌పై విడుదల అయినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు గల్ప్ దేశంలో ఏడాదిగా పని చేసి ఇంటికి తిరిగి వస్తున్న సందర్భంగా మందుబాటిళ్లు కొనుగోలు చేసి విమానంలోనే పార్టీ చేసుకున్నారు. ఇబ్బందిగా ఉందని చెప్పిన తోటి ప్యాసింజర్లతో వాగ్వాదానికి దిగడంతో విమానంలో గందరగోళ వాతావరణం నెలకొంది. విమానంలో ఇలాంటి ఘటనలు జరగడం ఏడాదిలో ఏడోసారి .
Here's ANI Tweet
#Update | Two Indigo flyers were booked under section 336 of IPC & sections 21,22 and 25 of Aircraft rules for being drunk & misbehaving with the crew. Both were arrested formally but as the sections were bailable, they were granted bail from the police station itself. Further…
— ANI (@ANI) March 23, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)